Viral News: మాజీ ప్రియుడి కోసం వ‌శీక‌ర‌ణం.. రూ.8.5 ల‌క్ష‌లు మాయం

Viral News: మాజీ ప్రియుడిని ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని ఓ యువ‌తి ఏకంగా రూ.8.5 ల‌క్ష‌లు పోగొట్టుకుంది. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులో చోటుచేసుకుంది. బెంగ‌ళూరుకు చెందిన ప్రియ అనే యువ‌తి కొంత‌కాలంగా బెంగ‌ళూరుకు చెందిన రాహుల్‌తో ప్రేమ‌లో ఉంది. కొద్ది రోజుల క్రితం ఇద్ద‌రూ విడిపోయారు. రాహుల్ లేకుండా ప్రియ ఉండ‌లేక‌పోయింది. ఎలాగైనా అత‌న్ని ద‌క్కించుకోవాల‌నుకుంది. ఆన్‌లైన్‌లో తెలిసిన జ్యోతిష్యుడిని సంప్ర‌దించ‌గా వ‌శీక‌ర‌ణం చేస్తే రాహుల్ ఎప్ప‌టికీ త‌న‌తోనే ఉంటాడ‌ని న‌మ్మ‌బ‌లికాడు. కానీ ఇందుకు కొంత ఖ‌ర్చు అవుతుంద‌ని చెప్పి ముందు రూ.501 తీసుకున్నాడు. ఆ త‌ర్వాత మెల్లిగా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకున్నాడు.

ఇంకా ఇంకా డ‌బ్బులు కావాలంటుండ‌గా ప్రియకు అనుమానం వ‌చ్చి ఇక ఇవ్వ‌న‌ని వారితో గొడ‌వ‌పెట్టుకుంది. దాంతో ఆ జ్యోతిష్యుడు ప్రియ వ్య‌క్తిగత వివ‌రాలు ఫోటోలు బ‌య‌ట‌పెడ‌తాన‌ని చెప్పి బెదిరింపుల‌కు పాల్ప‌డ‌గా రూ.8.5 ల‌క్షల వ‌ర‌కు ఇచ్చింది. ఇక చేసేదేమీ లేక ఇంట్లో వారికి విష‌యం చెప్పగా వారు పోలీసుల‌ను సంప్ర‌దించారు. ఆ త‌ర్వాత పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.