Prudhvi Raj: నేను చంద్ర‌బాబు, ప‌వ‌న్ వ‌దిలిన బాణాన్ని

Prudhvi Raj: కాంగ్రెస్ వదిలిన బాణం (వైఎస్ ష‌ర్మిళ‌) తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌కు 136 సీట్లు తెచ్చి పెట్టింద‌ని అన్నారు 30 ఇయ‌ర్స్ పృథ్వీ రాజ్. ఆయ‌న రానున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం నుంచి కానీ జ‌న‌సేన నుంచి కానీ టికెట్ ఆశిస్తున్నారు. బ్రో సినిమా స‌మ‌యంలో ద‌ర్శకుడు స‌ముద్ర‌ఖ‌ని.. బాధ్య‌త లేని వ్య‌క్తి క్యారెక్ట‌ర్ ఉంది చేస్తారా అని అడిగితే శ్యాంబాబు క్యారెక్ట‌ర్ చేసాన‌ని ysrcp మంత్రి అంబ‌టి రాంబాబుపై (ambati rambabu) మ‌రోసారి సెటైర్ వేసారు.

అధికారంలోకి వ‌చ్చిన నాలుగు సంవ‌త్స‌రాల‌లో అభివృద్ధి గురించి మాట్లాడింది లేదు కానీ మూడు పెళ్లిళ్ల గురించే ప్ర‌స్తావిస్తూ వ‌చ్చార‌ని ఆ మూడు పెళ్లిళ్ల వ‌ల్ల పోల‌వ‌రం ప్రాజెక్ట్ ఆగిపోయిందా? లేక‌పోతే ఒంగోలులో రోడ్లు, నెల్లూరులో అభివృద్ధి ఆగిపోయిందా అని విమ‌ర్శించారు. త‌న‌కు టికెట్ రాక‌పోయినా తెలుగు దేశం, జ‌న‌సేన కూట‌మికి స‌పోర్ట్‌గా నిలుస్తాన‌ని.. త‌న స‌త్తా ప్ర‌చారం స‌మ‌యంలో నిరూపిస్తాన‌ని పేర్కొన్నారు. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే తాను జ‌న‌సేన‌, తెలుగు దేశం వ‌దిలిన బాణాన్ని అని సెటైర్ వేసారు.