Jagan: ష‌ర్మిళ‌కు కౌంట‌ర్

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలైన వైఎస్ ష‌ర్మిళ‌పై ప‌రోక్షంగా కౌంట‌ర్ వేసారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం కష్టపడి జాకీలను పెట్టి ఆయనను లేపుతున్నారు అని జ‌గ‌న్ అన్నారు. ఇక్క‌డ జాకీ అంటే ష‌ర్మిళే అని క్లియ‌ర్‌గా అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ రెడ్డిని జ‌గ‌న్ రెడ్డి అనే పిలుస్తాన‌ని స‌వాల్ విసిరిన ష‌ర్మిళ‌.. త‌న పేరును తీసి మ‌రీ కామెంట్స్ చేస్తే ఇంకేమంటుందో.. ఇంకెంత ప‌రువు పోతుందో అని జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ష‌ర్మిళ పేరు తీయ‌కుండా సెటైర్లు వేస్తున్నారు.