EXCLUSIVE: వాయిదా ప‌డే అవ‌కాశం?

EXCLUSIVE: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr), కొర‌టాల శివ (koratala siva) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న దేవ‌ర (devara) సినిమా వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న అనిరుధ్ ర‌విచంద‌ర్ ఇత‌ర ప‌నుల‌తో బిజీగా ఉన్నార‌ట‌. అదీకాకుండా ఈ సినిమా Vfx పూర్తవ్వలేదు. సో ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ త‌క్కువే అని విశ్వ‌సనీయ వ‌ర్గాలు ఎక్స్‌క్లూజివ్‌గా వెల్ల‌డించాయి.

అదీకాకుండా ఈ సినిమాలో భైరా పాత్ర‌లో న‌టిస్తున్న బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ (saif ali khan) కాలికి స‌ర్జ‌రీ కానుంది. ఎంత కాద‌న్నా ఒక మూడు నెల‌ల పాటు విశ్రాంతి అవ‌స‌రం అని వైద్యులు అంటున్నార‌ట‌. సో.. అనుకున్న స‌మ‌యానికి దేవ‌ర రిలీజ్ కాక‌పోవచ్చు.