EXCLUSIVE: మూడేళ్ల తర్వాత కలుద్దాం.. బై బై..!
EXCLUSIVE: సూపర్‌స్టార్ మహేష్ బాబు (mahesh babu) గుంటూరు కారంతో (guntur kaaram) థియేటర్లతో కుర్చీని మడతపెట్టి ఆడిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మహేష్ మాస్ ఫ్యాన్స్‌కు మంచి దమ్ బిర్యానీ పెట్టించింది. ఇక మహేష్ బాబును మళ్లీ థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూసే ఫ్యాన్స్‌కి ఒక చిన్న బ్యాడ్ న్యూస్.
ఆయన్ను మళ్లీ తెరపై చూడాలంటే 2 నుంచి మూడేళ్ల పాటు ఆగాల్సిందే. ఎందుకంటే మహేష్ ప్రస్తుతం జర్మనీలో వెకేషన్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న సినిమా షూటింగ్లో పాల్గొంటారు. జక్కన్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనీసం మూడేళ్ల పడుతుంది. అప్పటివరకు మహేష్ బాబుని ఫ్యాన్స్ థియేటర్లలో మిస్ అవుతారు. సో ఆయన్ను థియేటర్లో చూడాలనుకుంటే ఇప్పుడే గుంటూరు కారం సినిమా చూసేయడం బెటర్ అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.