Rahul Gandhi: రాహుల్‌ని ఆల‌యంలోకి ఎందుకు అనుమ‌తించ‌లేదు.. ఏం జ‌రిగింది?

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అస్సాంలోని బ‌త‌ద్రావ స‌త్ర ఆల‌యంలోకి ఆహ్వానించ‌లేదు. దాంతో ఆయ‌న రోడ్డుపైనే బైఠాయించారు. భార‌త్ న్యాయ్ యాత్ర పేరుతో పాదయాత్ర చేప‌డుతున్న రాహుల్ గాంధీ అస్సాంలోని ఆల‌యంలో ద‌ర్శ‌నం చేసుకుందామ‌ని అనుకున్నారు. కానీ ఆయన్ను లోప‌లికి రానివ్వ‌లేదు. తాను ఏం పాపం చేసాన‌ని ఆల‌యంలోకి రానివ్వ‌డంలేదు అని ఆయ‌న రోడ్డుపై ధ‌ర్నా చేప‌ట్టారు.

తాను ఎలాంటి ర‌చ్చ చేయ‌డానికి రాలేద‌ని కేవ‌లం ప్ర‌శాంతంగా ఎలాంటి గొడ‌వ లేకుండా ద‌ర్శ‌నం చేసుకుందామ‌ని వ‌చ్చాన‌ని తెలిపారు. ఇక ముందు కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) ఎవరు ఏ ఆల‌యంలోకి వెళ్లాలో డిసైడ్ చేస్తారా అని ప్ర‌శ్నించారు. అయోధ్య‌కు రాహుల్ ఎలాంటి మ‌ద్ద‌తు తెల‌ప‌క‌పోవ‌డం పైగా అయోధ్య న‌రేంద్ర మోదీ కోస‌మే క‌ట్టించిన‌ట్లుగా ఆయ‌న మాట్లాడ‌టంతో BJP నేత‌లు ఆయ‌న్ను విమ‌ర్శిస్తున్నారు. అస్సాంలోనూ BJP ప్ర‌భుత్వ‌మే ఉండ‌టంతో రాహుల్‌కు నిర‌స‌న సెగ త‌ప్ప‌లేదు.