EXCLUSIVE: రామోజీ ఫిలిం సిటీ ప్రమాదం అసలు ఎలా జరిగింది?
EXCLUSIVE: రామోజీ ఫిలిం సిటీలో (ramoji film city) నిర్వహించిన ఓ సిల్వర్ జూబ్లీ వేడుకలో నిన్న రాత్రి విషాదం చోటుచేసుకుంది. వెస్టెక్స్ ఏషియా కంపెనీ సీఈవోతో సంజయ్ షా (56) పాటు కంపెనీ ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజ్ డాట్లా (52) కలిసి కంపెనీ పెట్టి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఫిలిం సిటీలో ఘనంగా పార్టీ ఏర్పాటుచేసారు. ఈ నేపథ్యంలో విశ్వనాథ్, సంజయ్‌లు కలిసి ఫైర్ వర్క్స్ ఏర్పాటుచేసిన ఊయల లాంటి దానిపై ఎక్కి సంబరాలు చేస్తుండగా ఊయల తాడు ఒకవైపు తెగిపోయింది. దాంతో ఇద్దరూ దాదాపు 6 అడుగుల నుంచి కిందకు పడ్డారు. ఇద్దరినీ వెంటనే దగ్గర్లోని మ్యాక్సీ క్యూర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మలక్‌పేట యశోదకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సంజయ్ షా మరణించారు. విశ్వనాథ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
ప్రమాదం ఇలా జరిగింది