Hanuman: అప్పుడే OTTలోకా?

Hanuman: తేజ స‌జ్జ (teja sajja) న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హ‌నుమాన్ సినిమా త్వ‌ర‌లో OTTలోకి వ‌చ్చేస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గుంటూరు కారం (guntur kaaram), నా సామి రంగ (naa saami ranga) వంటి పెద్ద సినిమాల‌ను దాటుకుని మ‌రీ హ‌నుమాన్ సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచింది. అలాంటిది అప్పుడే OTTలోకి వ‌చ్చేస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. OTTకి భారీ హ‌క్కుల‌కు అమ్ముడుపోయిన విష‌యం నిజ‌మే కానీ మ‌రో 7 వారాల పాటు హ‌నుమాన్ థియేట‌ర్ల‌లోనే ఉండ‌నుంది అని హ‌నుమాన్ టీం క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో కానీ అమెజాన్ ప్రైంలో కానీ స్ట్రీం కానుంది.