Spiritual: ఆంజ‌నేయ‌స్వామి విగ్ర‌హాన్ని ఎలా పెడితే మంచిది?

Spiritual: ఇంట్లో చాలా త‌క్కువ మంది ఇళ్ల‌ల్లో ఆంజ‌నేయ‌స్వామి విగ్ర‌హం ఉంటుంది. చాలా మంది ఫోటోలు మాత్ర‌మే పెట్టుకుంటారు. ఒక‌వేళ విగ్ర‌హం ఉంటే మాత్రం దానిని ఎలా ప‌డితే అలా పెట్ట‌కూడ‌దు. ఆ విగ్ర‌హాన్ని పెట్టేందుకు పాటించాల్సిన నియ‌మాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

*ఆంజ‌నేయుడి విగ్ర‌హాన్ని ఎప్పుడూ ద‌క్షిణం వైపు ఉంచాలి. ఈ దిశ‌గా పెడితే అంతా మంచే జ‌రుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉండ‌దు.

*మీ ఇంటి ప్ర‌ధాన ద్వారం తూర్పు, లేదా ద‌క్షిణం వైపు ఉంటే ఆంజనేయుడి విగ్ర‌హాన్ని అక్క‌డే ఏర్పాటు చేయించుకుంటే మంచిది.

*సూర్యుడు ఉద‌యించే దిక్కున పెట్టినా కూడా మంచిదే. రోజంతా ఉత్సాహంగా ఎంతో చురుగ్గా ఉంటారు. తూర్పు దిక్కున హ‌నుమంతుడి విగ్ర‌హం పెడితే లేలేత సూర్య‌కిర‌ణాలు విగ్ర‌హంపై ప‌డ‌తాయి. అది ఎంతో మంచిది. ఇల్లంతా పాజిటివిటీతో నిండిపోతుంది.

*విగ్ర‌హం కింద ఏద‌న్నా ఎత్తుగా ఉన్న పీట వేసి అమ‌ర్చాలి. నేల‌పై అస్స‌లు పెట్ట‌కండి.

*హ‌నుమంతుడి విగ్ర‌హం ఉన్న ప్ర‌దేశం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి.

*పొర‌పాటున కూడా విగ్ర‌హాన్ని మంచాల‌పై పెట్ట‌కండి. అస్సలు మంచిది కాదు.