Vijay Devarakonda: రష్మికతో పెళ్లిపై విజయ్ స్పందన
Vijay Devarakonda: త్వరలో రష్మిక మందన (rashmika mandanna), విజయ్ దేవరకొండ నిశ్చితార్ధం చేసుకోబోతున్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 22న నిశ్చితార్ధ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. దీనిపై ఎట్టకేలకు విజయ్ స్పందించారు. తన తల్లిదండ్రుల కంటే మీడియా వాళ్లు ప్రతి ఏటా తనకు పెళ్లి చేయాలని చూస్తున్నారని.. తను పెళ్లి చేసుకుంటే చూడాలని మీడియా వారికి కుతూహలంగా ఉందని విజయ్ అన్నారు. దీనిని బట్టి చూస్తే నిశ్చితార్ధం రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదని సగం క్లారిటీ వచ్చేసిట్లే..!