Mayo Japan: నేను అలా అనేస‌రికి ఎన్టీఆర్ షాక‌య్యారు

Mayo Japan: ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ మాయో జ‌పాన్.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) గురించి ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. మాయో జ‌పాన్ ఓ ఫేమ‌స్ యూట్యూబ‌ర్. అయితే ఆమె ఇండియా మొత్తం తిరిగేస్తూ మ‌న ప్రాంతీయ భాష‌ల‌ను కూడా నేర్చుకుంటోంది. మాయోకు హిందీ కూడా బాగా వ‌చ్చు. కానీ ఆమె మాట్లాడితే త‌ప్ప ఈ విష‌యం ఎవ్వ‌రికీ తెలీదు. త‌న అందం, మాట‌కారిత‌నంతో యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమ‌స్ అయిపోయింది.

ఆమె ఎంత‌గా ఫేమ‌స్ అయిందంటే.. 2022లో RRR సినిమా రిలీజ్ అవ్వ‌నున్న సంద‌ర్భంగా RRR టీం మొత్తాన్ని ఇంట‌ర్వ్యూ చేసే అవ‌కాశం వ‌చ్చిందట‌. ఆ స‌మ‌యంలో మాయోకు భాష‌ రాదు కాబ‌ట్టి.. NTR ఇంగ్లీష్‌, హిందీలో మాట్లాడుతున్నార‌ట‌. ఆ స‌మ‌యంలో మాయో కూడా హిందీలో స‌మాధానం ఇవ్వ‌డంతో తార‌క్ షాక‌య్యార‌ట‌. ఆయ‌న షాకింగ్ రియాక్ష‌న్‌ను త‌న కెమెరాలో బంధించాన‌ని అప్ప‌టి రోజుల‌ను గుర్తుచేసుకుంది మాయో.