RGV: “మ‌రి పెద్దాయ‌న్ను చంపిన‌వాడిని ఏం చేస్తావ్?”

RGV: ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌కుండా ఎవ‌ర్ని ప‌డితే వారిని ఏది ప‌డితే అది నిర్భ‌యంగా అడిగేస్తుంటారు. సోష‌ల్ మీడియా ఉంది క‌దా అని ట్యాగ్ చేసి మ‌రీ కామెంట్స్ పెడుతుంటారు. ఈరోజు దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు (NTR) వ‌ర్ధంతి సంద‌ర్భంగా నారా లోకేష్ (nara lokesh) ఓ ట్వీట్ చేసారు.

“” తెలుగుజాతి ఖ్యాతి మహానాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.‌ కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లు “” అని ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేసారు. దీనికి రామ్ గోపాల్ వ‌ర్మ స్పందిస్తూ.. మ‌రి ఆయ‌న్ను చంపిన హంత‌కుడిని ఏం చేస్తావ్ అని ప్ర‌శ్నించారు. దాంతో వ‌ర్మ‌పై నెటిజ‌న్లు అవాక్కులు చ‌వాక్కులు పేలుస్తున్నారు. YSRCP స‌పోర్ట‌ర్లు మాత్రం అది.. అలా అడుగు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.