Jr NTR: అయోధ్య ఈవెంట్‌కు నో చెప్పిన తార‌క్

Jr NTR: ఈ నెల 22న అయోధ్య‌లో జ‌ర‌గ‌నున్న రాముల వారి ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మానికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు కూడా ఆహ్వానం అందింది. అయితే తార‌క్ ఈ వేడుక‌కు వెళ్ల‌లేక‌పోతున్నారు. ఎందుకంటే తార‌క్ కొర‌టాల శివ (koratala siva) డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న దేవ‌ర (devara) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5న ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడుద‌ల చేయాల‌ని టీం గ‌ట్టిగా నిర్ణ‌యించుకుంది. ఒక్క‌రోజు తార‌క్ డేట్లు కుద‌ర‌క‌పోయినా షూటింగ్ అగిపోతుంది. అందుకే తార‌క్ అయోధ్య కార్య‌క్ర‌మానికి రాలేన‌ని చెప్పేసారు.