Spiritual: ప్రధాన ద్వారం ముందు ఇవి ఉంచితే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది
Spiritual: మన ఇంటి ప్రధాన ద్వారం ముందు పెట్టే కొన్ని వస్తువులకు లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంట్లోకి అడుగుపెడుతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇంతకీ ఏంటా వస్తువులు?
*ప్రధాన ద్వారాలపై స్వస్తిక ముద్ర ఉన్న స్టిక్కర్లు కానీ గంధం కానీ రాయండి. ఎంతో మంచిది. ఈ స్వస్తిక చిహ్నం ఉంటే దుష్టశక్తులు ఇంట్లోకి దరిచేరవు అని వాస్తు శాస్త్రం చెప్తోంది.
*ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ దీపాలు వెలుగుతూనే ఉండాలి. ఉదయం పూట ఫర్వాలేదు కానీ సంధ్యా సమయంలో తప్పకుండా దీపాలు వెలిగించండి. లైట్ల కంటే దీపాలు ఎంతో మంచివి. అమ్మవారికి ఇలా దీపాలు ఉన్న ద్వారాలంటే ఎంతో ఇష్టం.
*ద్వారం వద్ద చిన్న శంఖం పెట్టి ఉంచండి. లేదా చిన్న గంట పెట్టినా ఫర్వాలేదు. వీటి ధ్వనులకు ప్రసన్నురాలై లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందట.
*ద్వారం వద్ద చిన్న అద్దాన్ని ఉంచితే ఎంతో మంచిది. ఆ అద్దంపై ఎలాంటి మరకలు, పగుళ్లు అస్సలు ఉండకూడదు. అవి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి.
*ఓ చిన్న కలశంలో నీళ్లు పోసి ఓ పువ్వు వేసి ద్వారం వద్ద పెడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా ఇంటికి అతిథులు వస్తే ఆ జలాన్ని వారిపై చల్లి లోపలికి ఆహ్వానించండి. దీని వల్ల వారు బయట ఎక్కడి నుంచి వచ్చినా కూడా లోపలికి పవిత్రంగా అడుగుపెట్టినవారు అవుతారు. బయటి దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.