AP Elections: గుడివాడకు బాబు.. కొడాలి నాని అడ్డాలో హై టెన్ష‌న్

AP Elections: కొడాలి నాని (kodali nani) అడ్డా అయిన గుడివాడ‌కు (gudivada) రేపు తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) వెళ్తున్నారు. దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా చంద్ర‌బాబు గుడివాడ వెళ్ల‌నున్నారు. వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల అనంత‌రం చంద్ర‌బాబు రా క‌ద‌లిరా కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.  దాంతో గుడివాడలో ఇప్ప‌టినుంచే హై టెన్ష‌న్ మొదలైంది. ఎలాంటి అల్ల‌ర్లు జ‌ర‌గ‌కుండా పోలీసులు హై అల‌ర్ట్‌లో ఉన్నారు.