Mohammed Shami: పాండ్య లేక‌పోయినా వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు

Mohammed Shami: గుజ‌రాత్ టైటాన్స్‌కు (gujarat titans) గుడ్‌బై చెప్పి ముంబై ఇండియ‌న్స్‌కు (mumbai indians) వ‌చ్చేసిన హార్దిక్ పాండ్య‌పై (hardik pandya) మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ షాకింగ్ కామెంట్స్ చేసారు. పాండ్య గుజ‌రాత్ టైటాన్స్‌లో లేక‌పోయినా వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌ని అన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ష‌మీ గుజ‌రాత్ టైటాన్స్ ప్లేయ‌ర్‌గా ఉన్న నేప‌థ్యంలో ఓ సంద‌ర్భంగా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. “” టీంలో ఎవరు ఉన్నా లేక‌పోయినా ఏమీ ఫ‌ర‌క్ ప‌డ‌దు. పాండ్య రెండుసార్లు కెప్టెన్‌గా ఉన్నాడు. టీంను చాలా బాగా న‌డిపించాడు. కానీ గుజ‌రాత్ టైటాన్స్ జీవితాంతం పాండ్య‌ను కెప్టెన్‌గా ఉండాల‌ని డీల్ ఏమీ పెట్టుకోలేదు. పాండ్య వెళ్లిపోవాల‌నుకున్నాడు. ఇప్పుడు శుభ్‌మ‌న్ గిల్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు భారం, బాధ్య‌త అత‌నిపై ఉంటుంది. దీని గురించి పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు “” అని ష‌మీ వెల్ల‌డించారు.