Shree Rapaka: YSRCP నుంచి పోటీ..!

Shree Rapaka: సినీ న‌టి శ్రీరాపాక YSRCP నుంచి పోటీ చేయ‌నున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి గోపాలపురం నుంచి ఆమెకు టికెట్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా శ్రీపాక తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో పెద్ద సినిమాల‌కు ప‌నిచేసారు. నేకెడ్, నేకెడ్ ది ల‌స్ట్ వంటి సినిమాల్లో కూడా న‌టించారు. కానీ ఆమెకు న‌టిగా అవ‌కాశాలు రాలేదు. దాంతో త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన ఫ్యాష‌న్ డిజైనింగ్‌పైనే దృష్టిపెట్టారు. పూరీ జ‌గ‌న్నాథ్ , కృష్ణ‌వంశీ తీసిన సినిమాల‌కు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా ప‌నిచేసారు.