AP Elections: ఆలపాటి VS నాదెండ్ల మనోహర్‌

AP Elections: గుంటూరులో తెలుగు దేశం పార్టీలో (TDP) ముస‌లం ఏర్ప‌డింది. తెనాలి సీటు నుంచి ఎవ‌రు పోటీ చేస్తారు అనేదానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. తెనాలిలో జ‌న‌సేన (janasena) నుంచి నాదెండ్ల మ‌నోహ‌ర్ (nadendla manohar) పోటీ చేయాల్సి ఉంది. కానీ జ‌న‌సేన తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది కాబ‌ట్టి.. ఆ సీటు నుంచి ఆళ్ల‌పాటి రాజా  (allapati raja) కూడా పోటీ చేస్తాన‌ని అంటున్నారు. దాంతో ఎటూ తేల‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. నాదెండ్ల పోటీ చేస్తే తెలుగు దేశం పార్టీ కేడ‌ర్‌లో వ్య‌తిరేక‌త‌లు ఏర్ప‌డ‌తాయ‌ని టాక్ న‌డుస్తోంది. అదిష్ఠానం తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని అప్ప‌టివ‌ర‌కు తాను దీనిపై స్పందించాల‌ని అనుకోవ‌డంలేద‌ని ఆళ్ల‌పాటి రాజా అంటున్నారు.