Telangana: తెలంగాణ BJPకి కొత్త బాస్

Telangana: లోక్ స‌భ ఎన్నిక‌లు (lok sabha elections) ద‌గ్గ‌ర‌పడుతున్న స‌మ‌యంలో తెలంగాణ స్థానాల‌ను చేజిక్కించుకునేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో BJP బాస్‌ను మార్చేసింది. తెలంగాణ BJP ఆర్గ‌నైజేష‌న్ సెక్ర‌ట‌రీగా సునీల్ బ‌న్స‌ల్‌ను త‌ప్పించి చంద్ర‌శేఖ‌ర్‌ను నియ‌మించింది. చంద్ర‌శేఖ‌ర్ రాజ‌స్థాన్‌లో BJPకి అధికారాన్ని తెచ్చిపెట్టారు. ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఆయ‌న మ్యాజిక్ చేస్తారని BJP హైక‌మాండ్ గ‌ట్టిగా న‌మ్ముతోంది. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో స‌రైన సీట్లు గెల‌వ‌లేక‌పోయిన BJP ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం ఎలాగైనా త‌న స‌త్తా చూపించాల‌ని గ‌ట్టిగా ప్లాన్ చేసింది.