EXCLUSIVE: రూ.10 కోట్లు ఇస్తే టికెట్ క‌న్ఫామ్ అన్నారు

EXCLUSIVE: క‌ర్నూల్ మాజీ ఎంపీ సంజీవ్ కుమార్ (sanjeev kumar) ఇటీవ‌ల YSRCP పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రాజీనామా చేయ‌డం వెనుక ఉన్న కార‌ణాన్ని వివ‌రించారు సంజీవ్. త‌న వ‌ద్ద‌కు ఓ IAS అధికారిని పంపించి రూ.5 నుంచి రూ.10 కోట్ల వ‌ర‌కు లంచం ఇస్తే టికెట్ ఇస్తామ‌ని చెప్పించార‌ని కానీ తాను ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డ‌ను కాబ‌ట్టి మ‌ర్యాద‌పూర్వ‌కంగా పార్టీ నుంచి త‌ప్పుకున్నాన‌ని తెలిపారు.

గ‌త రెండేళ్ల నుంచి పార్టీలో అసంతృప్తి ఉన్న‌ప్ప‌టికీ ఎందుకులే అని వ‌దిలేసాన‌ని ఇక త‌న వ‌ల్ల కాలేద‌ని సంజీవ్ కుమార్ తెలిపారు. క‌ర్నూల్ అభివృద్ధి కోసం తాను అధికార పార్టీని ఏమీ అడ‌గ‌లేని ప‌రిస్థితి నెల‌కొందని ఇలాంటి స‌మ‌యంలో ఇక పార్టీతో ఉండ‌టం వృథా అనిపించింద‌ని పేర్కొన్నారు. ఎస్సీల‌కు బీసీల‌కు టికెట్లు ఇచ్చిన‌ప్ప‌టికీ వారి ప‌నుల‌న్నీ రెడ్డి కులానికి చెందిన‌వారే చూసుకుంటున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల వారి పేర్ల‌ను బ‌య‌ట చెప్ప‌లేనని అన్నారు.