Prabhas: పేరు మార్పించుకున్న డార్లింగ్.. ఎందుకు?

Prabhas: రెబెల్ స్టార్ ప్ర‌భాస్ త‌న పేరును మార్పించుకున్నారు. పేరు అంటే త‌న పేరులోని స్పెల్లింగ్ మార్పించుకున్నారు. మారుతి డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు రాజా సాబ్ (raja saab) అనే టైటిల్ ఖ‌రారు చేస్తూ మాస్ పోస్ట‌ర్‌ను సంక్రాంతి సంద‌ర్భంగా టీం రిలీజ్ చేసింది. అయితే పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ పేరు PRABHAS అని కాకుండా PRABHASS అని ఉంది. న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం ప్ర‌భాస్ త‌న‌కు క‌లిసొచ్చేలా పేరును అలా మార్పించుకున్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెప్తున్నారు.