TTDకి 3 కోట్ల జరిమానా
తిరుమలకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. ఈక్రమంలో భక్తులు వివిధ రూపాల్లో కానుకలు స్వామి వారికి సమర్పిస్తుంటారు. విదేశీయులు తమ కరెన్సీని సైతం హుండీలో వేస్తుంటారు. వీటిని ప్రతి నెల బ్యాంకులో టీటీడీ జమచేస్తుంది. ఇది సర్వ సాధారణంగా జరిగేదే. అయితే… భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీని బ్యాంకులో జమచేసే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలు టీటీడీ పాటించలేదు. ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించినందుకు మూడు కోట్లు జరిమానా విధించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే గతంలో టీటీడీకి ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ 2018తో ముగిసింది. దీన్ని ఇంత వరకు రెన్యువల్ చేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.3కోట్ల జరిమానా చెల్లించినందున.. లైసెన్సును రెన్యువల్ చేయాలని ఆర్బీఐకి కోరినట్లు చెప్పారు. హుండీ కానుకల ద్వారా రూ.30 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ వచ్చిందని ఆయన తెలిపారు.