Spiritual: కర్పూరం ఇలా వాడితే ఆ దోషాలు తొలగిపోతాయి
Spiritual: కర్పూరంతో ఎన్నో వాస్తు ప్రయోజనాలు ఉన్నాయి. సరైన రీతిలో కర్పూరాన్ని వాడటం తెలిసి ఉండాలే కానీ కొన్ని మన ఇంటిని పట్టి పీడిస్తున్న కొన్ని రకాల దోషాలకు పరిహారం దొరికేసినట్లే. మన ఇంట్లోని కర్పూరంతోనే కొన్ని దోషాలను ఈ విధంగా తొలగించుకోవచ్చు. అదెలాగో చూసేద్దాం.
*ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల నెగిటివటీ అంతా పోతుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కర్పూరం వెలిగిస్తూ ఉండండి. ఇంట్లోని నలుమూలల్లో కర్పూర ధూపం వేయండి.
*ఉన్నట్టుండి ఆర్ధికంగా నష్టపోతుంటే గ్రహాల అనుకూలత బాలేదని అర్థం. వెండి పాత్రలో నాలుగు లవంగాలు, కర్పూరం వేసి వెలిగించి ఇల్లంతా ధూపం వేయండి. అనారోగ్య సమస్యలు ఉంటే కూడా ఈ వాసనకు తగ్గుతాయి.
*జాతకంలో దోషాలు ఏమన్నా ఉన్నా కూడా కర్పూరంతో పరిహారాలు చేసుకోవచ్చు. మల్లెలు, కర్పూర నూనెను నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది.
*లవంగాలు, కర్పూర ధూపాన్ని దుర్గా దేవికి 43 రోజుల పాటు వేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి.
*మీ జీవిత భాగస్వామితో రోజూ గొడవలు అవుతుంటే మీరు నిద్రపోయే గదిలో కర్పూరం వెలిగిస్తే మంచిది.
*ప్రతి శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కర్పూర తైలం వేసుకుని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.