Hyderabad: ప‌రిశుభ్ర‌మైన న‌గ‌రాల్లో 9వ స్థానం.. మొద‌టి స్థానం దేనిదో తెలుసా?

Hyderabad: భార‌త‌దేశంలోనే అత్యంత శుభ్ర‌మైన న‌గ‌రాల్లో హైద‌రాబాద్‌కు తొమ్మిదో స్థానం ల‌భించింది. సౌత్ ఇండియాలో మొద‌టి స్థానంలో సిద్ధిపేట జిల్లా ఉంది. ఎన్నో స‌వాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల స‌హ‌కారంతో న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామ‌ని గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారి వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌కు స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్ అవార్డు రాగా.. సిద్ధిపేట‌కు జాతీయ అవార్డు ల‌భించింది. హైద‌రాబాద్ ఐటీ హ‌బ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని.. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారికి కూడా ఇక్క‌డ ఉండేందుకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌దు అన్న ఉద్దేశంతో అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.