EXCLUSIVE: “చింతమనేని మాత్రం వద్దు బాబూ..!”
EXCLUSIVE: దెందులూరు తెలుగు దేశం పార్టీలో (TDP) అసమ్మతి సెగ రాజుకుంది. చింతమనేని ప్రభాకర్ (chintamaneni prabhakar) కాకుండా మరే అభ్యర్ధిని పెట్టినా వారికి మద్దతు తెలుపుతాం కానీ చింతమనేని మాత్రం వద్దు అని స్థానికులు చెబుతున్నారు. చింతమనేనికి వ్యతిరేకంగా ఏలూరులో తెలుగు దేశం పార్టీ, జనసేన కార్యకర్తలు సమావేశం అయ్యారు. చింతమనేనిని కమ్మ సామాజిక వర్గమే వ్యతిరేకిస్తోందని కార్యకర్తలు అంటున్నారు.