Sankranthi రోజున ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం
Sankranthi: సంక్రాంతి పండుగ రోజు కొన్ని పనులు చేయడం ద్వారా ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఈసారి లీప్ ఇయర్ కావడంతో సంక్రాంతి ఈ నెల 15న వచ్చింది. మరి సంక్రాంతి రోజున ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందాం.
*నువ్వులను దానం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే శని వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయి.
*బెల్లం దానం చేస్తే సూర్యభగవానుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. (sankranthi)
*మీరు సంక్రాంతి రోజున ఇంట్లో కిచిడీ వండుతున్నట్లైతే ఎవరైనా పేద వారికి కాస్త పెట్టి చూడండి. ఎంతో మంచిది.
*ఏవైనా ఐదు రకాల ధన్యాలను దానంగా ఇచ్చినా ఎంతో మేలు జరుగుతుంది.
*శని దేవుని ఆశీస్సుల కోసం నూనెను దానంగా ఇవ్వాలి. (sankranthi)
*పేదలకు దుప్పట్లు దానం చేస్తే రాహు, కేతుల దోషాలు తొలగిపోతాయట.
*ఆవులకు తౌడు, మేత పెడితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది.
*కెరీర్ బాగుండాలంటే నెయ్యి దానం చేస్తే మంచిది.