BiggBoss​ 7 హోస్ట్​గా బాలకృష్ణ!

టెలివిజన్​ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్​ రియాలిటీ షో బిగ్​బాస్​. దేశవ్యాప్తంగా పలు భాషల్లో సక్సెస్​ఫుల్​గా కొనసాగుతున్న ఈ షో తెలుగులోనూ విజయవంతంగా ఆరు సీజన్లతోపాటు ఓ ఓటీటీ సీజన్​ కూడా పూర్తి చేసుకుంది. ఇక మొదటి సీజన్​ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండవ సీజన్​కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్​, ఓటీటీ సీజన్​కి కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జుననే హోస్టుగా వ్యవహరించారు. బిగ్​బాస్​ కంటే ముందు నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి కూడా హోస్ట్​గా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. కాగా, కొందరు అభిమానులు నాగార్జున బాగా హోస్ట్​ చేస్తున్నారని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం రొటీన్​గా ఉంటుందని కామెంట్లు.

అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఏడవ సీజన్​కి సరికొత్త సర్​ప్రైజ్​ ప్లాన్​ చేస్తోంది స్టార్​మా. ఈ సీజన్​ కోసం ఏకంగా నటసింహం బాలకృష్ణను హోస్ట్​గా ఒప్పించే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఇక, ఆహాలో వచ్చిన అన్​స్టాపబుల్​తో బాలయ్య వ్యాఖ్యాతగా అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ షో ద్వారా బాలయ్యలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించింది ఆహా. బాలయ్య హుషారు, కొంటెతనం, అల్లరి ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అందుకే ఈ షో దేశంలోనే టాప్​ షోల్లో ఒకటిగా నిలిచింది. ఈ షో రెండు సీజన్లు అత్యధిక వ్యూస్​ సాధించి రికార్డులు సృష్టించాయి. ఇక ఇప్పుడు బాలయ్య బిగ్ బాస్ నెక్ట్స్​ సీజన్​ హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటిదాకా ఎన్టీఆర్, నాని మరియు నాగార్జునకి కూడా ఇవ్వనంత పారితోషికం బిగ్ బాస్ టీమ్​ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక మార్చి 31 నుంచి జరుగనున్న టాటా ఐపీఎల్ మ్యాచెస్ కి బాలయ్య కామెంటేటర్ గా వ్యవహరించనున్నారు. ప్రమోషనల్ మ్యాచెస్ కి ఆయన తెలుగు కామెంటరీ చెప్పనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు చేప్పట్టడం ఖాయం అంటున్నారు. అసలు బాలయ్య యాటిట్యూడ్, కరుకుతనం బిగ్ బాస్ హోస్టింగ్ కి బాగా సరిపోతుంది. బాలయ్య లాంటి వ్యక్తి హోస్ట్ గా ఉంటే కంటెస్టెంట్స్ క్రమశిక్షణతో ఉంటారు. తప్పు చేయాలంటే భయపడతారు అంటున్నారు నెటిజన్లు. ఇక ప్రస్తుతం బాలయ్య అనిల్​ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 108వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తవగానే హ్యాట్రిక్​ హిట్​ కాంబోగా పేరొందిన బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా మొదలవనుందని తెలుస్తోంది.