Spiritual: సాయంత్రం వేళ‌లో గోళ్లు క‌త్తిరిస్తే ఏమ‌వుతుంది?

Spiritual: కొంద‌రు వేళాపాళా లేకుండా ఎప్పుడు ప‌డితే అప్పుడు గోళ్లు క‌త్తిరించేస్తుంటారు. ఇంకొంద‌రు వారం, తిథి, స‌మ‌యం చూసి మ‌రీ గోళ్ల‌ను క‌త్తిరిస్తుంటారు. అస‌లు సాయంత్రం వేళ‌ల్లో ఎప్పుడూ కూడా గోళ్ల‌ను క‌త్తిరించ‌కూడ‌దు అని చెప్తుంటారు పెద్ద‌లు. అలా ఎందుకు చెప్తారు? అలా చేస్తే ఏమ‌వుతుంది?

*సాయంత్రం వేళల్లో గోళ్లు క‌త్తిరించ‌డం అస్స‌లు మంచిది కాదు. బ్యాక్ ల‌క్ వెంటాడుతుంది. అస‌లే మ‌న జీవితాలు అంతమాత్రం. రిస్క్ ఎందుకు చెప్పండి..!

*సాయంత్రం, రాత్రి వేళ‌ల్లో దుష్ట‌శ‌క్తులకు ఎక్కువ సామ‌ర్ధ్యం ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో గోళ్లు క‌త్తిరిస్తే వాటి పీడ మ‌న‌కు త‌గులుతుంది.

*అంతేకాదు.. ఇత‌రుల గోళ్లు కూడా మీరు క‌త్తిరించ‌కూడ‌దు. ఇత‌రుల గోళ్లు మీరు క‌ట్ చేస్తున్నారంటే దాని అర్థం మీరు వారి నుంచి వేరు కాబోతున్నార‌ని.

*సాయంత్రం వేళ‌ల్లో చంద్ర బ‌లం ఎక్కువ‌గా ఉంటుంది. ఆ స‌మ‌యంలో గోళ్లు క‌ట్ చేసుకుంటే చంద్రుడి నుంచి రావాల్సిన లాభాలు ద‌క్క‌డుండాపోతాయి.

*రాత్రి, సాయంత్రం వేళ‌ల్లో గోళ్లు క‌త్తిరించుకుంటే ఆత్మ‌ల‌ను నిద్ర‌లేపిన‌ట్లు అవుతుంద‌ట‌. మ‌న పూర్వీకుల ఆత్మ‌ల‌కు కూడా శాంతి క‌ల‌గ‌దు అని చెప్తుంటారు.