థైరాయిడ్‌ని తగ్గించుకోండిలా!
ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. వయస్సుతో సంబంధం లేకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. మధుమేహం, రక్తపోటు సమస్యల్లానే ఇదీ దీర్ఘకాలం వేధించే సమస్య. దీని బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిందే. అయినప్పటికి సమస్య పూర్తిగా తగ్గుతుందనే గ్యారంటీ ఉండదు. అంతేకాదు ఈ మందులను ఎక్కువగా వాడడం వల్ల అనేక దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా మందులతో పాటు ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చు. థైరాయిడ్‌ను నియంత్రించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
- థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచడంలో కొబ్బరి నూనె ఎంతగానో సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కొబ్బరి నూనెను వాడడం వల్ల థైరాయిడ్ సమస్య అదుపులో ఉండడంతో పాటు అధిక బరువు సమస్య నుండి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను ఒక గ్లాస్ వేడి నీటిలో లేదా ఒక గ్లాస్
- పాలల్లో కలిపి తాగాలి లేదా అన్నం మొదటి ముద్దలో కలిపి తీసుకోవాలి. ఇలా కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది.
థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచడంలో పెరుగు బాగా దోహదపడుతుంది. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగును తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది. అదే విధంగా కొత్తిమీరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య తగ్గు ముఖం పడుతుంది. - వారానికి రెండు నుండి మూడుసార్లు అర గ్లాసు కొత్తిమీర జ్యూస్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే ఔషధ గుణాలు థైరాయిడ్ ను అదుపులో ఉంచడంలో మనకు ఎంతో సహాయపడతాయి. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు అల్లాన్ని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
- అల్లం టీ లో, తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గు ముఖం పడుతుంది. అలాగే పాలకూర జ్యూస్ ను తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ ను మనం తగ్గించుకోవచ్చు.
- పాలకూరను 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో నిమ్మరసం వేసి కలిపి తాగాలి. ఇలా తాగడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.
- చేపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య అదుపులో ఉంటుంది. అయితే చేపలను ఉడికించి మాత్రమే తీసుకోవాలి. నూనెలో వేసి వేయించి తీసుకోవడం వల్ల చేపలను తిన్నప్పటికి ఎటువంటి ఫలితం ఉండదు. అలాగే దాల్చిన చెక్కతో టీని తయారు చేసుకుని తాగడం వల్ల కూడా థైరాయిడ్ ను అదుపులో ఉంచుకోవచ్చు
- క్యారెట్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ సమస్య నియంత్రణలో ఉంటుంది. సలాడ్స్ లో లేదా క్యారెట్‌ను జ్యూస్‌గా చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. థైరాయిడ్ సమస్యను తగ్గించడంలో ఉసిరికాయ కూడా చక్కగా పని చేస్తుంది. ఉసిరికాయ పొడి లేదా జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ ను అదుపులో ఉంచుకోవచ్చు.