Chandrababu Naidu: ఓటు డిలీట్ చేయ‌డానికి నువ్వెవ‌రు..?

Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan) ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో సమావేశం అయ్యారు. అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ త‌న‌కు సెక్యూరిటీ కావాల‌ని అడిగారని తెలిపారు. ఎన్నిక‌ల డ్యూటీకి వ‌చ్చే ఆఫీస‌ర్‌ను ఆల్ ఇండియా లెవెల్‌లో ఎంపిక చేయాల్సి ఉంద‌ని అన్నారు.

“” నా సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇంత‌టి నీచ‌మైన అరాచ‌క‌మైన రాజ‌కీయాల‌ను మేం ఎప్పుడూ చూడ‌లేదు. ఓట్లు తీసేస్తే త‌ప్ప గెల‌వ‌లేమ‌నే అభిప్రాయానికి వ‌చ్చేసారు. ఒక్క చంద్ర‌గిరిలో ఫామ్ 6 కింద 1,15000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో 33 వేల ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజ‌క‌వ‌ర్గంలో డివిడెంట్స్ అన్నీ పెట్టాం. అన్నీ వివ‌రించాం. స్టేట్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఆరోజు ప‌డిన అవ‌స్థ అంతా ఇంతా కాదు. కేంద్ర హోంమంత్రిని సెక్యూరిటీ కావాల‌ని అడిగారు. ఫైన‌ల్‌గా ఒక్క‌టే చెప్పాం. ఏదైతే ఎన్నిక‌ల డ్యూటీ చేసే ఆఫీస‌ర్‌ని సెలెక్ష‌న్ ప్రాసెస్‌లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్‌లో చేసే బెస్ట్ ప్ర‌క్రియ‌ల్లో ఎంపిక చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఒక‌ప్పుడు టీచ‌ర్లు, ఆఫీస‌ర్లు ఉండేవారు. ఆ స‌మ‌యంలో ఎక్క‌డా త‌ప్పు జ‌రిగేది కాదు. దానిపైన ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎవ‌రైనా డ్యూటీ చేయ‌లేక‌పోతే యాక్ష‌న్ తీసుకునేవారు. ఈరోజు మ‌హిళా పోలీసుల బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియ‌మించేస్తున్నారు. ఇది నాకు ఆశ్చ‌ర్య‌మేసింది. వారిని ఆఫీస‌ర్లుగా పెడితే వారికి ఏం తెలుస్తుంది? ఏపీని రాతి యుగానికి తీసుకెళ్లాల‌నుకుంటున్నారు. ఇవ‌న్నీ ఎన్నిక‌ల అధికారుల‌కు వివ‌రించాం. మాపై 7000 కేసులు బ‌నాయించారు. పుంగ‌నూరులో 250 కేసులు ఉన్నాయి. ఇప్పుడు బైండ్ ఓవ‌ర్ కేసులు పెడుతున్నారు. ఎన్నిక‌ల్లో ప‌నిచేయ‌నివ్వ‌కుండా నిర్వీర్యం చేయ‌డానికి య‌త్నిస్తున్నారు. ఇలాగైతే ప్ర‌జాస్వామ్యం కూనీ అయిపోయిన‌ట్లే.

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ సాఫీగా జ‌రిగింది. కానీ ఏపీలో మాత్రం అలా లేదు. మేం ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌టానికి అన్ని విధాలా ప్ర‌య‌త్నిస్తాం అని ఎన్నిక‌ల అధికారులు హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ అవ‌స‌ర‌మైతే సెంట్ర‌ల్ పోలీస్ అబ్స‌ర్వ‌ర్ల‌ను పంపించాలి. ఎక్క‌డిక‌క్క‌డ మానిట‌ర్ చేసి ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా చూడాలి. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఎప్ప‌టిక‌ప్పుడు ఫిర్యాదులు చేస్తాం. అదే స‌మ‌యంలో ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్టం. కోర్టుకు వెళ్లి శిక్ష ప‌డే వ‌ర‌కు పోరాడ‌తాం. ప‌క్క రాష్ట్రంలో స్థిర‌ప‌డిన వారు ఇక్క‌డ ఓటు వేస్తే తొల‌గించ‌డానికి మీరెవ‌రు (జ‌గ‌న్). ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తే వారు ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటారు కానీ నువ్వెవ‌రు వారి ఓటు తొల‌గించ‌డానికి “” అని తెలిపారు.