EXCLUSIVE: YSRCPలో రచ్చ రచ్చ..!
EXCLUSIVE: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార YSRCP పార్టీలో రచ్చ జరుగుతోంది. ఎస్సీ స్థానాలపై చిన్న చూపు చూస్తున్నారు అంటూ అధిష్ఠానంపై ఎస్సీ నేతలు మండిపడుతున్నారు. నరసరావుపేట, పెనమలూరు నియోజకవర్గాల్లో ఎన్ని బుజ్జగింపులు చేసినా ఎవ్వరూ తగ్గడంలేదు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లిగూడెం ప్యాలెస్‌కు ఆహ్వానించగా.. వారు రాకపోవడం గమనార్హం. టికెట్లు ఇవ్వకుండా బుజ్జగింపులు వల్ల ఏమీ కాదు అంటూ మూతి ముడుచుకుని కూర్చుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నరసరావుపేటలో బ్రహ్మారెడ్డి వర్గం బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ విజయ సాయి రెడ్డిని రంగంలోకి దించగా చర్చలు విఫలం అయ్యాయి.