EXCLUSIVE: చంద్రబాబు ఒక బ్రోకర్.. నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది
EXCLUSIVE: చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఓ బ్రోకర్ అని ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని అన్నారు YSRCP మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) . నిన్న కనిగిరిలో రా.. కదలిరా అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అంబటి రాంబాబును ఆంబోతు రాంబాబు అన్నారు. దీనిపై అంబటి రాంబాబును స్పందించాల్సిందిగా కోరగా.. ఆయన ఆంబోతులకు ఆవులను సప్లై చేసే బ్రోకర్ అని మునిగిపోతున్న తెలుగు దేశం పార్టీలోకి ఎన్ని పార్టీలను చేర్చుకున్నా వేస్టే అని మండిపడ్డారు. ఇంకోసారి తన గురించి ఈ విధంగా మాట్లాడితే ఇంకా నీచంగా తానూ మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు. అలా మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు బోరున ఏడవటం తప్ప ఏమీ చేయలేరని విమర్శించారు.