EXCLUSIVE: శ‌త్రువు కాదు ప్ర‌త్య‌ర్ధి మాత్ర‌మే..!

EXCLUSIVE: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ఎన్నికల‌కు (ap elections) ముందు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఏపీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) రెండోసారి ఎలాగైనా గెలిచి తీరాల‌ని పార్టీ కోసం అహ‌ర్నిశ‌లు ప‌నిచేసిన నేత‌ల‌ను సైతం ప‌క్క‌న పెట్టేందుకు సిద్ధం అవుతుంటే..ఆయ‌న చెల్లెలు వైఎస్ ష‌ర్మిళ (ys sharmila) కాంగ్రెస్‌తో చేతులు క‌లిపి మ‌రీ ఏపీలో స‌డెన్ ఎంట్రీ ఇచ్చింది.

దాంతో జ‌గ‌న్ అన్న వ‌దిలిన బాణం ఎవ‌రిని గుచ్చుతుందా అనే టెన్ష‌న్ ఏపీలో మొద‌లైంది. చెల్లెలితో కొంత‌కాలంగా స‌త్సంబంధాలు లేని జ‌గ‌న్ నేరుగా ఆమె ఎంట్రీ గురించి స్పందించ‌లేక పార్టీ నేత‌ల‌తో ష‌ర్మిళ వ‌చ్చినా రాక‌పోయినా త‌మ‌కు ఎలాంటి ఫ‌ర‌క్ ప‌డ‌దు అని చెప్పిస్తున్నారు. అయితే ష‌ర్మిళ ఎంట్రీపై YSRCP నేత వెంక‌టేశ్వ‌ర రెడ్డి స్పందించారు.

అన్న‌పై, తండ్రిపై త‌ప్పుడు కేసులు బ‌నాయించి అన్న‌ను జైల్లోకి పంపించిన కాంగ్రెస్ పార్టీతో ష‌ర్మిళ చేతులు క‌లిపిందంటే త‌మ‌కు కూడా షాకింగ్‌గా ఉంద‌ని అన్నారు. అలాగ‌ని ఆమెను త‌మ పార్టీ శ‌త్రువుగా చూడటంలేద‌ని.. రాజకీయ ప్ర‌త్య‌ర్ధిగా మాత్ర‌మే చూస్తోందని అన్నారు. YSRCP పార్టీకి ఏ పార్టీలోనూ శత్రువులు లేరని ఉన్న‌ది ప్ర‌త్య‌ర్ధులు మాత్ర‌మే అని తెలిపారు.