2024 T20 World Cup: ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

2024 T20 World Cup: 2024 టీ20 ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ వ‌చ్చేసింది. యావ‌త్ భార‌త‌దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 9న జ‌ర‌గ‌నుంది. ఈసారి ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏంటంటే.. క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి 20 టీమ్స్ పాల్గొన‌నున్నాయి. 55 మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. జూన్‌1 నుంచి మొద‌లుకానున్న మ్యాచ్‌లు అమెరికా, వెస్ట్ ఇండీస్‌లో జ‌ర‌గ‌నున్నాయి.

ఇండియా వ‌ర్సెస్ ఐర్లాండ్ – జూన్ 5 – న్యూయార్క్

ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ – జూన్ 9 – న్యూయార్క్

ఇండియా వ‌ర్సెస్ అమెరికా – జూన్ 12 – న్యూయార్క్

ఇండియా వ‌ర్సెస్ కెన‌డా – జూన్ 15 – ఫ్లోరిడా