AP Elections: ఎవరి కుటుంబంలో ఎవరు చిచ్చులు పెడుతున్నారు జగన్ అన్నా?
AP Elections: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) ఇటీవల ఓ పబ్లిక్ మీటింగ్లో ప్రతిపక్ష పార్టీలు తన కుటుంబంలో చిచ్చులుపెడుతున్నారని అన్నారు. వైఎస్ షర్మిళ (ys sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరడం… ఏపీలో అడుగుపెట్టడంతో జగన్ ఈ విధంగా మాట్లాడారు.
అసలు జగన్ కుటుంబంలో కొత్తగా చిచ్చులు పెట్టడానికి ఏముంది? ఎన్నికల సమయంలో తల్లి, చెల్లిని వాడుకుని అధికారంలోకి వచ్చాక పక్కకు నెట్టింది ఎవరు? సొంత పార్టీ నేతలతోనే దివంగత నేత వివేకానంద రెడ్డి కూతురు సునీతను తిట్టించింది ఎవరు? సొంత ఛానెళ్లలోనే సునీత గురించి తప్పుగా ప్రచారాలు చేయించింది ఎవరు? చెల్లెలు షర్మిళను తెలంగాణలో అవమానిస్తుంటే మౌనంగా ఉండిపోయింది ఎవరు? ఇది జగన్ చేసుకున్న సొంత డ్యామేజ్. అలాంటిది ప్రతిపక్షాలు తన కుటుంబంలో చిచ్చులు పెడతాయని అనడంలో అసలు అర్థం ఉందా?
షర్మిళ ఏపీలో అడుగుపెడుతోందని తెలిసి జగన్ ఆమెతో మాట్లాడకపోవడం.. తన పార్టీలోకి ఆహ్వానించకపోవడంతో ప్రజలకు కూడా చెల్లెల్ని ఏ విధంగా కష్టపెడుతున్నారో తెలిసిపోయింది. ప్రజల మైండ్లో తానో విలన్గా ఉండకూడదు అన్న ఒక్క కారణంతో తన కుటుంబం చీలడానికి కారణం ప్రతిపక్షాలు అని జగన్ ఇతరులపై నిందలు వేసేయడం ఎంత వరకు కరెక్ట్?