Prabhas: నా ఫీలింగ్స్ అర్థంచేసుకుంటే చాలు
Prabhas: సలార్‌తో (salaar) బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు ప్రభాస్. ఇక కల్కితో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత సలార్ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పారు ప్రభాస్. తన అభిమానులు ఇన్నాళ్లూ చూపించిన నిస్వార్ధమైన ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువేనని.. వారికి తాను ఎంత రుణ పడి ఉన్నానో కూడా చెప్పడానికి మాటలు రావడంలేదని అన్నారు. తన ఫీలింగ్స్ ఫ్యాన్స్ అర్థంచేసుకోగలిగితే అంతే చాలని అన్నారు. ఫ్యాన్స్ ప్రేమ కారణంగానే వివిధ జోనర్లకు చెందిన సినిమాల్లో నటిస్తున్నానని తనకు స్క్రిప్ట్ నచ్చితే ఎంత రిస్క్ అయినా చేస్తానని చెప్పారు. కల్కి సినిమానే కాకుండా మారుతితో ఓ హారర్ సినిమాలో కూడా ప్రభాస్ నటించనున్నారు.