YS Sharmila: పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరడంలేదు
YS Sharmila: ఈరోజు ఢిల్లీకి బయలుదేరిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో షర్మిళ కాంగ్రెస్‌లో చేరతారు. ఆమెతో పాటు YSRTPకి చెందిన 30 మంది నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. అయితే తాను పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడంలేదని అన్నారు షర్మిళ. అయితే తన అన్న జగన్ కుటుంబాలను చీలుస్తున్నారు అని చేసిన కామెంట్స్‌పై స్పందించడానికి మాత్రం షర్మిళ నిరాకరించింది.