Thandel: టాలీవుడ్‌లో త‌ర్వాతి ప్ర‌భంజ‌నం దీనిదే

Thandel: అక్కినేని నాగ‌చైతన్య (naga chaitanya) న‌టిస్తున్న తండేల్ సినిమా టాలీవుడ్‌లోనే త‌ర్వాతి ప్ర‌భంజ‌నం కాబోతోంది. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే ఓ ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోతుందని చిత్ర బృందం చెప్తోంది. ఈ నెల 5న గ్లింప్స్ 5 గంట‌ల‌కు రిలీజ్ కాబోతోంది. ఇందులో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇందులో ఆమె రోల్ మ‌రింత స్ట్రాంగ్‌గా ఉండ‌బోతోంద‌ట‌. ల‌వ్ స్టోరీ త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న నాగ‌చైత‌న్య‌కు ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ బూస్ట్ ఇస్తుంద‌ట‌. అయితే తండేల్ పోస్ట‌ర్లు చూస్తుంటే కాస్త ఎన్టీఆర్ న‌టిస్తున్న దేవ‌ర సినిమా పోస్ట‌ర్ల‌లాగే ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా రెండూ సముద్రానికి సంబంధించిన‌వే. ఇందులో హీరోయిన్లు కూడా ప‌ల్లెటూరి ప‌డుచులుగా క‌నిపించ‌నున్నారు. చూద్దాం.. తండేల్ మెప్పిస్తుందో దేవ‌ర అల‌రిస్తుందో.