స్టార్ న‌టుడి కూతురి పెళ్లి వేడుక‌లో మాజీ భార్య‌ల హంగామా!

Aamir Khan: బాలీవుడ్‌లో పెళ్లిళ్ల పర్వం ఎలా అయిపోయిందంటే.. ఒక‌రు కాక‌పోతే ఇంకొక‌రు.. కానీ భార్య మాత్రం మంచి స్నేహితురాలిగానే ఉంటుంది అనే స్థాయికి దిగ‌జార్చేసారు. అంద‌రికీ ఓకే అయితే ఎలాంటి గొడ‌వ‌లు ఉండ‌వు. ఇప్పుడు బాలీవుడ్ మిస్ట‌ర్ పర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది.

ఆమిర్ ఖాన్ మొద‌టి భార్య రీనా ద‌త్తా కూతురు ఇరా ఖాన్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్క‌నుంది. ఈరోజు ఆమిర్ ఖాన్ నివాసంలో హ‌ల్దీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో రీనా ద‌త్తాతో పాటు ఆమిర్ రెండో మాజీ భార్య కిర‌ణ్ రావు కూడా పాల్గొన్నారు. పైగా మాజీ భార్య‌లు ఇద్ద‌రూ ఒకే ర‌క‌మైన చీర‌లు ధ‌రించి సంద‌డి చేసారు. ఇలా మాజీ భార్య‌లు క‌లిసే ఉండ‌టం.. వారు త‌మ మాజీ భ‌ర్త‌ల‌తో ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేయ‌డం బాలీవుడ్‌కి అల‌వాటే.