YS Sharmila: రేపు జగన్ ఇంటికి షర్మిళ
YS Sharmila: వైఎస్ షర్మిళ రేపు తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy)నివాసానికి వెళ్లనున్నారు. షర్మిళ కుమారుడు రాజా రెడ్డి, ప్రియ అట్లూరిల నిశ్చితార్ధం ఈ నెలలో జరగనుంది. మార్చి నెలలో పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేసారు. తొలి శుభలేఖను ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద ఉంచిన షర్మిళ రెండో శుభలేఖను తన అన్నకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇందుకోసం తన అన్న ఇంటికి వెళ్లి స్వయంగా నిశ్చితార్థం, పెళ్లి వేడుకలకు ఆహ్వానించాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంలో షర్మిళ కాంగ్రెస్‌లో చేరే అంశం గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.