UPI Transactions: కొత్త రూల్స్ ఇవే..!

UPI Transactions: UPI లావాదేవీల‌పై కొత్త రూల్స్ వ‌చ్చాయి. UPI పేమెంట్స్ ఎక్కువ అవుతున్న నేప‌థ్యంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024లో కొత్త రూల్స్‌ని అమ‌ల్లోకి తీసుకొచ్చింది. అవేంటంటే..

*గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పేల‌లో వాడుక‌లో లేని UPI ఐడీల‌ను తొల‌గించాల్సిందిగా NPCI (ది నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా) ఆదేశాలు జారీ చేసింది. ఏడాది నుంచి వాడుక‌లో లేని ఐడీలు, నెంబ‌ర్లు ఈరోజు నుంచి ఇక ప‌నిచేయ‌వు. (UPI Transactions)

*UPI ద్వారా చెల్లింపులు చేయాల‌నుకునేవారికి రోజూవారి లిమిట్ రూ. 1 ల‌క్ష‌

*అయితే హాస్పిట‌ల్స్, విద్యా సంస్థ‌ల్లో ఈ లిమిట్‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచింది.

*PPI (ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్) వంటి ఆన్‌లైన్ వాలెట్ల‌ ద్వారా రూ.2000 లేదా అంత‌కుమించి చెల్లించాల‌నుకుంటే 1.1 శాతం ఇంట‌ర్‌చేంజ్ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

*సైబ‌ర్ నేరాలు ఎక్కువ అయిపోతున్న నేప‌థ్యంలో రోజులో తొలి రూ.2000 ఆన్‌లైన్‌ చెల్లింపు చేసేవారు మ‌రో చెల్లింపు చేసేందుకు నాలుగు గంట‌ల పాటు వేచి ఉండాల్సిందే. ఈ రూల్ మీరు ఇదివ‌ర‌కు ఎప్పుడూ డ‌బ్బు పంప‌నివారికి పంపిన‌ప్పుడే వ‌ర్తిస్తుంది. (UPI Transactions)

*ప్ర‌ముఖ జ‌ప‌నీస్ కంపెనీ హిటాచితో రిజ‌ర్వ్ బ్యాంక్ కొత్త డీల్ కుదుర్చుకుంది. ఇక నుంచి హిటాచి ద్వారా UPI ఏటీఎంలు రాబోతున్నాయి. ఈ ఏటీఎంల ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డ‌బ్బును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.