YS Sharmila: కుమారుడి పెళ్లి తేదీ ప్రకటించిన షర్మిళ
YS Sharmila: వైఎస్ షర్మిళ తన కుమారుడు రాజా రెడ్డి పెళ్లి తేదీని ప్రకటించారు. రాజా రెడ్డి.. (ys raja reddy) ప్రియ అట్లూరి (priya atluri) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వీరి వివాహానికి అందరూ అనుమతించారు. ఈ నెల 18న నిశ్చితార్ధం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహ వేడుకను నిర్వహించనున్నట్లు షర్మిళ ట్విటర్ ద్వారా తెలియజేసారు. రేపు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు షర్మిళ కుటుంబం వెళ్లనుంది. తొలి ఆహ్వాన పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచనున్నట్లు షర్మిళ తెలిపారు.