2024 లో జ‌ర‌గ‌బోయే షాకింగ్ అంశాలు..!

శుభ‌మా అని కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతుంటే 2024లో జ‌ర‌గ‌బోయే షాకింగ్ అంశాలు అని నెగిటివ్ మాట‌లు ఎందుకు అని తిట్టుకోకండి. ప్ర‌ముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్త్రదామ‌స్ (nostradamus) 2024లో ఏం జ‌ర‌గ‌నున్నాయో 16వ శ‌తాబ్దంలోనే చెప్పేసారు. ఇంత‌కీ ఏంటా అంశాలు?

*నోస్త్రదామ‌స్ చెప్పిన‌దాని ప్ర‌కారం వాటిక‌న్ సిటీకి ఇప్పుడున్న పోప్ ఫ్రాన్సిస్ కాకుండా కొత్త పోప్ రాబోతున్నార‌ట‌. పోప్ ఫ్రాన్సిస్ 2024లో చ‌నిపోయే అవ‌కాశం ఉంద‌ని కూడా చెప్పారు.

*ఇప్ప‌టికే కోవిడ్, వ‌ర‌ద‌లు, భూకంపాల‌తో ప్ర‌పంచం వ‌ణికిపోతోంది. ఇది జస్ట్ ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ట‌. 2024లో భూమి మ‌రింత ఎండిపోతుంద‌ట‌.

*క్వీన్ ఎలిజ‌బెత్ ఎప్పుడు చ‌నిపోతుందో ముందే చెప్పి నోస్త్రదామ‌స్.. ఇప్పుడు బ్రిట‌న్ రాజ‌వంశానికి ఎలిజ‌బెత్ మ‌న‌వ‌డైన హ్యారీ రాజు కాబోతున్నాడ‌ని చెప్పారు. విలియం ఉండ‌గా హ్యారీ ఎందుకు రాజు అవుతారో మాత్రం అర్థంకావ‌డంలేదు. మ‌రో విష‌యం ఏంటంటే.. ఇప్పుడు హ్యారీ రాజ‌కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. త‌న భార్య మేఘ‌న మార్కెట్ కోసం రాజ కుటుంబం అనే ముద్ర‌ను తొల‌గించుకుని సాధార‌ణ జీవితాన్ని గ‌డుపుతున్నారు.

*చైనా దేశం ఇండియ‌న్ మ‌హాస‌ముద్రం ద్వారా యుద్ధం చేయ‌బోతోంద‌ట‌. అయితే ఈ యుద్ధంలో చైనా ఓడిపోతుంద‌ని కూడా చెప్పారు.

నోస్త్రదామ‌స్ చ‌నిపోయిన‌ప్ప‌టికీ ఆయన చెప్పింది చెప్పిన‌ట్లు జ‌రిగాయ్. అందుకే 2024 సంవ‌త్సరం వ‌స్తున్న నేప‌థ్యంలో నోస్త్రదామ‌స్ భ‌విష్య‌వాణి ఏంటా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.