Rahul Gandhi: వారి క‌న్నీటికంటే “బాహుబ‌లి” ఎక్కువైపోయాడా?

Rahul Gandhi: ప్ర‌ధాని నరేంద్ర మోదీకి (narendra modi) చుర‌క‌లు అంటించారు రాహుల్ గాంధీ. రెజ్ల‌ర్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (WFI) మాజీ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ ష‌ర‌ణ్ సింగ్ (brij bhushan sharan singh) వ‌ల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్ వంటి స్టార్ రెజ్ల‌ర్లు ఎన్నో ఆందోళ‌న‌లు చేప‌డితే.. చివ‌రికి బ్రిజ్ భూష‌ణ్‌ను తొల‌గించి అత‌ని స‌న్నిహితుడిని ఫెడ‌రేషన్ చీఫ్‌గా ఎంపిక‌చేసిన డబుల్
షాక్ ఇచ్చింది కేంద్రం.

దాంతో రెజ్ల‌ర్లు చేసేదేమీ లేక వారు అందుకున్న మెడ‌ల్స్ అన్నీ ప్ర‌భుత్వానికి తిరిగిచ్చేసారు. అయినా కూడా దీనిపై మోదీ ఇంకా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఆడ‌పిల్ల‌ల‌కు ముందు ఆత్మాభిమానం ఆ త‌ర్వాతే ఇంకేదైనా. అయినా దేశ ఆడ‌పిల్ల‌ల క‌న్నీటి కంటే బాహుబ‌లి నుంచి అందాల్సిన రాజ‌కీయ లాభాలే మోదీకి ఎక్కువైపోయాయా? దేశ ప్ర‌ధాని అంటే దేశాన్ని కాపాడే వ్య‌క్తి. కానీ ఈ విష‌యంలో ఆయ‌న నోరుమెద‌ప‌కపోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది అని ట్వీట్ చేసారు. ఇక్కడ రాహుల్ బాహుబ‌లి అనింది ఇంకెవ‌రినో కాదు.. బ్రిజ్ భూష‌ణ్‌నే..!