Telangana: మీరు పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్ అయితే ఏం చేయాలి?
Telangana: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలను అమలు చేసేందుకు ప్రజా పాలన పేరిట ఒకే దరఖాస్తు విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 6 వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే ఈ దరఖాస్తులు కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయితే ఏం చేయాలి?
దరఖాస్తు రిజెక్ట్ అవ్వడం అనేది మీరు ఇచ్చే వివరాలను బట్టే ఉంటుంది. మీకు ఉండాల్సిన వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన ఐడీ ప్రూఫ్‌లలో ఏదన్నా లోపం ఉంటేనే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ ఇలా రిజెక్ట్ అయితే.. ఒక తెల్ల కాగితంలో ఎందుకు రిజెక్ట్ చేసారో లేఖ రాసి అదే సెంటర్‌లో మీ వివరాలు అన్నీ రాసి ఇవ్వండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ అంశంపై ప్రభుత్వం కూడా ఏమీ చెప్పలేకపోతోంది. అర్హులు అయినప్పటికీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి అనేదానిపై కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తులు ఇవ్వలేకపోయిన వారు జనవరి 6 తర్వాత కూడా మరో తేదీన సబ్మిట్ చేయవచ్చని అధికారులు చెప్తున్నారు