Revenge: ఉద్యోగులంతా కలిసి..బాస్ న్యూడ్ ఫోటోలు షేర్ చేసి.. !
Revenge: ఉద్యోగులకు కోపం వస్తే ఎంతకైనా తెగిస్తారని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. బాస్‌పై కోపంతో ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఉద్యోగులంతా కలిసి ఓ ప్లాన్ వేసారు.
ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరాలో చోటుచేసుకుంది. ఓ కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు తమ బాస్ పెడుతున్న టార్చర్ భరించలేకపోయారు. దాంతో వారిద్దరూ బాస్‌పై పగ తీర్చుకోవాలనుకున్నారు. ఆ ఇద్దరు ఉద్యోగుల్లో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి వేరే నెంబర్ నుంచి తన బాస్‌కు మెసేజ్‌ను పెట్టి తన వలలో వేసుకోవాలనుకుంది. అలా బాస్ తెలీక ఆమె అడిగిన న్యూడ్ ఫోటోలన్నీ పంపేవాడు.
ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు బాస్ భార్యకు కూడా షేర్ చేసారు. దాంతో ఆయన తలెత్తుకోలేకపోయాడు. మూడు నెలల పాటు ఆ ఇద్దరూ బాస్‌ను ఇలా వేధిస్తుంటే ఇక చేసేదేంలేక అతను సైబర్ క్రైంకు ఫిర్యాదు చేసారు. విచారణలో తన జీవితంలో ఆడుకుంది తన కంపెనీలోని ఉద్యోగులే అని తెలిసి ఆయన కంగుతిన్నారు. అందరి ముందు నోటికొచ్చినట్లు మాట్లాడేవాడని బుద్ధి చెప్పడానికే ఇలా చేసామని వారు తప్పు ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు.