Teacher: విద్యార్ధితో టీచర్ పాడుపని
Teacher: చదువు చెప్పాల్సిన గురువు ఇలా విద్యార్ధికి ముద్దులు పెడుతూ ఫోటోషూట్లకు పోజలివ్వడం చూస్తుంటే ఈ సమాజం ఎటు పోతోంది అనే ప్రశ్నలకు తావిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
చింతామణి తాలూకాలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో పై ఫోటోలో కనిపిస్తున్న మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో మైనర్ అయిన బాలుడికి ఏవో మాయమాటలు చెప్పి అతని చేత కుర్తా పైజామా వేయించి ఆమె చీర కట్టుకుని ఇలా రొమాంటిక్ పోజులిస్తూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు తీసింది కూడా ఆ టీచరే కావడం గమనార్హం. ఇవి ఎలా బయటికి వచ్చాయో తెలీదు కానీ బాలుడి తల్లి దండ్రులు మండిపడ్డారు. వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.