Vijaykanth: ఆయ‌న్ను “కెప్టెన్” అని ఎందుకంటారో తెలుసా?

Vijaykanth: ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు కెప్టెన్ విజ‌య్‌కాంత్ ఈరోజు క‌న్నుమూసారు. కొంత‌కాలంగా కోవిడ్‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈరోజు ఉద‌యం కండీషన్ సీరియ‌స్ అయ్యి తుదిశ్వాస విడిచారు. దాంతో త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ క‌న్నీటి సంద్రంలో మునిగింది.

అయితే విజ‌య్‌కాంత్ గురించి ఎవ‌రు ఎప్పుడు ప్ర‌స్తావించినా కెప్టెన్ అని సంబోధిస్తారు. ఆయ‌న ఆధార్ కార్డులో కూడా కెప్టెన్ విజ‌య్‌కాంత్ అనే ఉంటుంద‌ట‌. ఇంత‌కీ ఈ కెప్టెన్ అనే బిరుదు ఎందుకొచ్చింది?

1991లో ఆర్కే సెల్వ‌మ‌ణి ద‌ర్శ‌కత్వంలో విజ‌య్‌కాంత్ కెప్టెన్ ప్ర‌భాక‌రణ్ అనే సినిమాలో న‌టించారు. ఇది విజ‌య్‌కాంత్ 100వ‌ చిత్రం. ఇందులో ఆయ‌న ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా అన్ని భాష‌ల్లో సూప‌ర్ హిట్. దాంతో ఆయ‌న్ను అంద‌రూ కెప్టెన్ విజ‌య్‌కాంత్ అనే పిలుస్తున్నారు.