AP Elections: ఇక మా దారి మేం చూసుకుంటాం
AP Elections: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని దృఢంగా నిర్ణయించుకున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy). గత ఎన్నికల్లో దాదాపు 150 స్థానాలు గెలుచుకున్న YSRCP ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకు కారణం దాదాపు 95 స్థానాల్లో అభ్యర్ధులను మార్చాలని జగన్ నిర్ణయించుకోవడమే. దాంతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్‌ను కలిసి మచ్చిక చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లిగూడెంలోని జగన్ క్యాంప్ ఆఫీస్‌కి వెళ్లి ఆయన్ను కలవాలనుకోగా వారికి నిరుత్సాహమే మిగిలింది. జగన్‌ను కలవనివ్వకుండా సీఎంఓ అడ్డుకున్నారట. ఎందుకు కలవకూడదు అని ఎమ్మెల్యేలు నిలదీస్తే ఇదిగో మీ తప్పుల చిట్టా అంటూ చదివి మరీ వినిపిస్తున్నారట. దాంతో ఎమ్మెల్యేలకు ఒళ్లుమండింది.
తమ తప్పుల చిట్టాను జగన్ పిలిచి వివరించినా అర్థంచేసుకునేవాళ్లం అని సీఎంఓకి ఏమవసరం అని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాగైతే తమ దారి తాము చూసుకుందాం అని ఒకరితో ఒకరు అనుకుంటూ వెనుదిరిగారు. ఎటూ రేపో మాపో కాంగ్రెస్ వైఎస్ షర్మిళకు (ys sharmila) ఏపీ బాధ్యతలు అప్పగించనుంది. చూడబోతే చాలా మంది YSRCP ఎమ్మెల్యేలు టికెట్ రాకపోతే షర్మిళతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు.