Ayodhya: సీత‌మ్మ‌వారు శాపాన్ని వెన‌క్కి తీసుకుంది

Ayodhya: అయోధ్య రామ మందిర నిర్మాణంతో కోట్లాది భార‌తీయుల క‌ల ఇంకొన్ని రోజుల్లో నెర‌వేర‌నుంది. జ‌న‌వ‌రిలో రామ‌య్య విగ్ర‌హాన్ని ప్రాణ‌ప్ర‌తిష్ఠ చేయ‌నున్నారు. అయోధ్య‌లో కొత్త‌గా రైల్వే స్టేష‌న్, ఎయిర్‌పోర్ట్ కూడా రానున్నాయి. ఐదేళ్ల క్రితం వ‌ర‌కు ఒక్క ఫైవ్ స్టార్ హోట‌ల్ లేని అయోధ్య‌లో ఇప్పుడు మేం హోట‌ళ్లు క‌డ‌తామంటే మేం క‌డ‌తామంటూ దాదాపు 100 మంది అర్జీలు పెట్టుకున్నారు.

ఇదంతా అయోధ్య రామ మందిరం వ‌ల్లే కుదిరింది. ఇప్పుడు అయోధ్య దేశంలోనే అత్యుత్త‌మ ప‌ర్యాట‌క ప్రాంతం కాబోతోందంటే దీనికి కార‌ణం ఆనాడు సీత‌మ్మ‌వారు పెట్టిన శాపాన్ని వెన‌క్కి తీసుకోవ‌డ‌మే అని అంటున్నారు బీమ్లేంద్ర మోహ‌న్ ప్ర‌తాప్ మిశ్రా. ఈయ‌న అయోధ్య రాజ‌కుటుంబానికి చెందిన వ్య‌క్తి. అంద‌రూ ఈయ‌న‌ను రాజా సాహెబ్ అని పిలుస్తుంటారు. అయోధ్య రామ‌మందిర నిర్మాణాన్ని ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్న‌ది ప్ర‌తాప్ మిశ్రానే. ఆనాడు అయోధ్య‌లో సీత‌మ్మ‌కు అవ‌మానం జ‌ర‌గ‌డంతో ఆమె ఈ ప్రాంతానికి శాపం పెట్టి వెళ్లిపోయింద‌ని.. ఇప్పుడు శాపం నుంచి విముక్తి క‌లిగింది కాబ‌ట్టే ఈ అభివృద్ధి జరుగుతోంద‌ని ఆయ‌న సంబ‌ర‌ప‌డిపోతున్నారు.